సెన్సేషన్ రేపుతున్న “కాశ్మీర్ ఫైల్స్” ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందంటే.!

Published on Mar 16, 2022 11:00 pm IST


ఇండియన్ సినిమా దగ్గర లేటెస్ట్ గా మరియు సైలెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రం “కాశ్మీర్ ఫైల్స్”. గత శుక్రవారం భారీ పోటీ లోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ముందు చాలా తక్కువ ఓపెనింగ్స్ ని అందుకొంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలే షాక్ అయ్యారు.

రోజు రోజుకి అందులోని వర్కింగ్ డేస్ వచ్చినా కూడా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వెళ్తున్నాయి తప్ప తగ్గకపోవడంతో అసలు ఈ సినిమా ఏంటి అని ఇతర భాషల్లో వెతకడం స్టార్ట్ చేశారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రల్లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించని ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఒక సెన్సేషన్.

అయితే వసూళ్ల పరంగా అదరగొడుతున్న ఈ సినిమా ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా చూడాలని పలు కంపెనీ లు స్వచ్చందంగా తమ ఎంప్లాయిస్ కి సెలవులు ప్రకటిస్తున్నారట. దీని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సినిమా కోసం మరింత తెలుసుకోవాలి అనుకుంటే క్రింది సమీక్ష పై క్లిక్ చేసి చూడండి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :