“చరణ్ 15” పై లేటెస్ట్ సెన్సేషనల్ రూమర్.!

Published on Mar 10, 2023 1:02 pm IST


గ్లోబల్ స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఇండియన్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అయితే ఇప్పుడు భారీ హంగులతో తెరకెక్కుతుంది. వచ్చే నెల నుంచి మలి షూటింగ్ స్టార్ట్ కానుండగా లేటెస్ట్ గా ఓ సెన్సేషనల్ రూమర్ అయితే ఒక్కసారిగా వైరల్ గా మారింది.

ఈ సినిమాలో కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అజిత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారని శంకర్ భారీ ప్లానింగ్ వేశారు అంటూ ఓ రేంజ్ లో టాక్ నడుస్తుంది. అయ్యుటే ఆల్రెడీ ఈ చిత్రంలో వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి మళ్ళీ అజిత్ పేరేంటి? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతానికి అయితే ఈ ఊహించని రూమర్ సౌత్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో మారిపోయింది. ప్రస్తుతానికి ఇవన్నీ అవాస్తవం అనే తెలుస్తున్నాయి.

సంబంధిత సమాచారం :