బాలయ్య సినిమా సెట్స్ లో జాయిన్ అయిన శృతి హాసన్.!

Published on Jun 19, 2022 8:01 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ లో 107వ సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సాలిడ్ మాస్ టీజర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయగా దానికి మాసివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఇలా శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం పై మేకర్స్ లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈమె నిన్నటి నుంచి ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యినట్టుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిపై దర్శకుడు గోపీచంద్ తో శృతి హాసన్ మానిటర్ ముందు కూర్చొని ఒక హ్యాపీ మూమెంట్ ఫోటోని షేర్ చేసి కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాలో శృతి హాసన్ ని గోపీచంద్ ఎలా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :