యూత్ ని ఆకట్టుకుంటున్న 90ఎంఎల్ లేటెస్ట్ సాంగ్

Published on Nov 9, 2019 5:53 pm IST

ఈ ఏడాది హిప్పీ, గుణ 369 వంటి చిత్రాలలో అలరించిన యంగ్ హీరో కార్తికేయ త్వరలో 90ఎం ఎల్ చిత్రంతో రానున్నాడు. ఎప్పుడూ లిక్కర్ తాగే పర్ఫెక్ట్ లవర్ గా కార్తికేయ కనిపిస్తున్నారు. ఇటీవల విడువులైన ఈ మూవీ టీజర్ అలాగే, ఓ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కాగా నిన్న 90ఎంఎల్ చిత్రం నుండి మరో పాట విడుదలైంది. ‘నాతో నువ్వుంటే చాలు… అనే ఈ పాటను నిన్న విడుదల చేయగా యూత్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అనూప్ రూబెన్స్ అందించిన స్వరాలకు చంద్ర బోస్ సాహిత్యం అందించగా అద్నాన్ సమీ పాడారు.

గతంలో అనూప్ రూబెన్స్, అద్నాన్ సమీ కాంబినేషన్లో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ విడుదల కానుంది.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More