టాక్..”భీమ్లా నాయక్” కి కూడా రెండు రిలీజ్ డేట్ లు..?

Published on Jan 22, 2022 7:03 am IST

టాలీవుడ్ సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా క్రేజీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గబాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. పవన్ అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉండగా ఆల్రెడీ మేకర్స్ ఫిబ్రవరి 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ఎప్పుడో ఫైనల్ చేసేసారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకి కూడా రెండు రిలీజ్ డేట్స్ ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయట. మొదటగా ఈ ఫిబ్రవరి 25 కాగా మరొకటి ఏప్రిల్ 1న అట. అయితే ఆల్రెడీ ఏప్రిల్ 1 మెగాస్టార్ “ఆచార్య” కూడా ఉంది. మరి అన్నయ్యతో పవన్ పోటీకి వస్తాడా అనే ప్రశ్న పక్కన పెడితే ఈ రిలీజ్ డేట్స్ పై ఒక అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :