ఎన్టీఆర్ బయోపిక్ లో ‘విఠలాచార్య’గా ప్రముఖ దర్శకుడు !

ఎన్టీఆర్ బయోపిక్ లో ‘విఠలాచార్య’గా ప్రముఖ దర్శకుడు !

Published on Oct 14, 2018 11:51 AM IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది.

కాగా ఈ చిత్రంలో ఆ కాలం లెజండరీ దర్శకుల పాత్రలను కూడా చూపించనున్నారు. అప్పటి గొప్ప దర్శకుడు విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ శంకర్ నటించబోతున్నట్లు గతంలోనే తెలియజేశాము. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో శంకర్ పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తోంది చిత్రబృందం.

ఈ ఏడాది చివరకి కల్లా ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే పాటలు అన్ని కూడా పూర్తి చేశారని.. అద్భుతంగా వచ్చాయని కీరవాణి కెరీర్ లో మరో సూపర్ హిట్ ఆల్బమ్ అని నిలుస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు