బాలయ్య రెండో సారి సీఎం అవ్వగానే.. క్లైమాక్స్ !

బాలయ్య రెండో సారి సీఎం అవ్వగానే.. క్లైమాక్స్ !

Published on Oct 15, 2018 3:56 PM IST

నందమూరి బాలకృష్ణ రెండుసార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విషయంలోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్నఎన్టీఆర్ జీవిత కథను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. అయితే సినిమాలో బాలయ్య రెండు సార్లు సీఎం అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే రెండో సారి సీఎం అవ్వగానే.. క్లైమాక్స్ తో బయోపిక్ కి ముగింపు పలకనున్నారు.

కాగా ఈ రెండు సార్లు సీఎం అయ్యే సందర్భాలు కూడా.. ఎన్టీఆర్ మొదటి సారి అఖండ విజయం సాధించి సీఎం అయ్యే సందర్భం ఒకటి కాగా, నాదండ్ల భాస్కరరావుని సీఎంగా దించిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భం ఒకటి. ఈ రెండు సందర్భాలు ఎన్టీఆర్ బయోపిక్ లో ముఖ్యమైన సన్నివేశాలుగా చూపించనున్నారు. ఈ సన్నివేశాల్లోనే బాలయ్య రెండు సార్లు సీఎంగా కనిపించనున్నారు.

జనవరి 9న విడుదలయ్యే మొదటి పార్ట్ ‘కథానాయకుడు’గా జనవరి 24న విడుదలయ్యే రెండో పార్ట్ ‘మహానాయకుడు’గా ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు