మిషన్ ఇంపాజిబుల్ రెండో పాటపై లేటెస్ట్ అప్డేట్

Published on Mar 21, 2022 5:00 pm IST


తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1, 2022 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ కి సిద్ధంగా ఉంది. స్వరూప్ RSJ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్ మరియు జయతీర్థ మొలుగు కీలక పాత్రల్లో నటించారు.

ఈరోజు ఈ చిత్రం లోని రెండో పాట కి సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేయడం జరిగింది. ఏంట్రా అదృష్టాన్ని సాంగ్ ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం హారి చరణ్, దీపక్ ఎరగర సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్ర‌మోష‌న్ కంటెంట్ సినిమాపై అంచ‌నాలు పెంచింది.

సంబంధిత సమాచారం :