మాస్ మహారాజ్ “ఖిలాడి” పై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది!

Published on Jul 24, 2021 11:00 am IST


ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో దర్శకుడు రమేష్ వర్మతో ప్లాన్ చేసిన సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఖిలాడి” కూడా ఒకటి. “క్రాక్” లాంటి అదిరే మాస్ కం బ్యాక్ తర్వాత రవితేజ స్టార్ట్ చేసిన సినిమా కావడం పైగా తనకెరీర్ లోనే హై యాక్షన్ డ్రామా ఇదే కావడంతో దీనిపై మంచి హైప్ కూడా నెలకొంది.

అయితే మాస్ మహారాజ్ మాస్ స్పీడ్ లోనే ఈ సినిమా కూడా చాలా వరకు శరవేగంగా కంప్లీట్ చేసేసారు. అలాగే అన్ని కరెక్ట్ గా ఉండి ఉంటే గత మే నెలలోనే ఈ చిత్రం విడుదల అయ్యేది. మరి ఇప్పుడు లేటెస్ట్ గా మేకర్స్ ఒక అధికారిక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం తాలూకా కొత్త షెడ్యూల్ ని ఈ వచ్చే జూలై 26 న చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

హైదరాబాద్ లో మొదలు కానున్న ఈ కొత్త షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. మరి దీనిపై ఒక అదిరే పోస్టర్ ని కూడా వదిలారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తుండగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :