‘బిగ్ బీ అమితాబ్’ ఆరోగ్యం పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jul 12, 2020 11:12 am IST

బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ లాంటి దిగ్గజానికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన మిలియన్ల మంది అభిమానులు మరియు భారతీయ చలనచిత్ర ప్రముఖులు ఆయన ఆరోగ్య నివేదికల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పిఆర్ ఆఫీసర్ అమితాబ్ ఆరోగ్యంపై ప్రెస్ నోట్ పంపారు.

ఆదివారం తెల్లవారుజామున పంపిన నోట్‌లో, అమితాబ్ తేలికపాటి కోవిడ్ లక్షణాలతో స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన్ను ఆసుపత్రిలోని ఐసోలేషన్ విభాగంలో చేర్చారు. అమితాబ్‌తో పాటు ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్ కూడా స్థిరంగా మరియు బాగా కోలుకుంటున్నారు.

తన పాత్రలతో భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా అమితాబ్ పొందారు. పైగా భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు.

సంబంధిత సమాచారం :

More