లేటెస్ట్..అజిత్ “వలిమై” ట్రైలర్ పై బిగ్గెస్ట్ అప్డేట్..!

Published on Dec 29, 2021 3:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “వలిమై”. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ కానుంది అని రీసెంట్ గానే అనౌన్స్ చేయగా మరింత హైప్ ఈ సినిమాపై నెలకొంది.

ఇక ఈ గ్యాప్ లో మాత్రం ఆభిమానులు సహా యాక్షన్ మూవీ లవర్స్ అంతా ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సాలిడ్ ట్రైలర్ పైనే లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ ఈ వచ్చే కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించగా తెలుగులో “బలం” అనే టైటిల్ తో సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందివ్వగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :