“అఖండ” భారీ క్లైమాక్స్ కి రంగం సిద్ధం..అప్డేట్ ఇదే.!

Published on Jul 23, 2021 12:19 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే సాలిడ్ మాస్ ఎంటర్టైనెర్ సంగతి తెలిసిందే. బాలయ్య మరియు బోయపాటిల కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఎనలేని అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం షూట్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యి చివరి షెడ్యూల్ కి వచ్చిన సంగతి తెలిసిందే.

కొన్ని రోజులు కితమే ఈ సినిమా క్లైమాక్స్ కోసం లొకేషన్ వేటలో బోయపాటి ఉన్నారని అది కూడా ఒక దేవాలయంలో ఉంటుందని టాక్ బయటకి వచ్చింది. మరి ఈ షెడ్యూల్ పైనే లేటెస్ట్ సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాలోని భారీ క్లైమాక్స్ నిమిత్తం తమిళనాడులోని విల్లిపురంకి చెందిన వెంకటరమణ దేవాలయంలో ప్లాన్ చేశారట. అలాగే ఈ చిత్రం నిన్న జూలై 21 నుంచి వచ్చే ఆగస్టు 5 వరకు కూడా అక్కడే షూటింగ్ జరుపుకొనే విధంగా మేకర్స్ ఆల్రెడీ అనుమతులు తీసుకున్నట్టుగా ప్రెస్ నోట్ వైరల్ అవుతుంది.

అలాగే ఈ షూట్ లో బాలయ్యతో పాటుగా ప్రధాన పాత్రధారులు కూడా నటించనున్నారట. ఇక మరో సాలిడ్ అప్డేట్ ఏమిటంటే ఈ క్లైమాక్స్ సన్నివేశంలో లాస్ట్ టీజర్ లో చూపిన అఘోర గెటప్ లోనే బాలయ్య పాల్గొంటున్నారట. దీనితో మరో లెవెల్ మాస్ బాలయ్య ఈ క్లైమాక్స్ లో చూపించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :