జమున గారి అంత్యక్రియలపై తాజా అప్డేట్.!

జమున గారి అంత్యక్రియలపై తాజా అప్డేట్.!

Published on Jan 27, 2023 12:30 PM IST

ఈరోజు టాలీవుడ్ దిగ్గజ తార వెటరన్ నటి జమున గారు కన్ను మూసినా వార్తతో టాలీవుడ్ లో మరో శకం ముగిసింది. ఎన్నెన్నో చిత్రాల్లో అద్భుత పాత్రలు చేసిన ఈ నటి ఈరోజు ఉదయం వారి స్వగృహం లోనే కన్ను మూసారు. దీనితో వీరి మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. మరి ఇదిలా ఉండగా ఈ తదదనంతరం కార్యక్రమాలకి సంబంధించి అయితే లేటెస్ట్ సమాచారం ఇప్పుడు తెలుస్తుంది.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జమున గారి పార్థివదేహం ను వారి ఇంటి నుంచి ఫిలిం ఛాంబర్ కి తరలించనుండగా అక్కడ సాయంత్రం నాలుగున్న వరకు ప్రముఖుల సందర్శనార్ధం ఉంచనున్నారు. ఆ తరువాత సాయంత్ర 5 గంటలకి అయితే ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబీకుల సమక్షంలో మహాప్రస్థానంలో అంత్య క్రియల కార్యక్రమాలు జరగనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు