జీవితా, రాజశేఖర్ ల ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఇదే.!

Published on Oct 24, 2020 4:02 pm IST

ప్రపంచ దేశాలను ఇంకా పట్టి పీడిస్తున్న కరోనా బెడద ఎప్పుడు వదులుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఇదిలా ఉండగా ఈ కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో చాలా మంది అగ్ర తారలను సైతం కబళించిన ఈ కరోనా ఇటీవలే ప్రముఖ హీరో రాజశేఖర్ కుటుంబానికి సోకింది.

వీరిలో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు కరోనా నుంచి కోలుకోగా రాజశేఖర్ దంపతులు మాత్రం చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించింది అని వార్త షాక్ కు గురి చేసింది. కానీ తర్వాత వారు అడ్మిట్ అయిన ఆసుపత్రి సిబ్బంది అధికారికంగా ఎలాంటి ప్రమాదం లేదని చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అలాగే ఇప్పుడు కూడా ఇద్దరు భార్యాభర్తల ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ ను ఇచ్చారు.

రాజశేఖర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆయన ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారని తగిన చికిత్సను కొనసాగిస్తున్నట్టుగా వారు తెలిపారు. ఇక శ్రీమతి జీవిత ఆరోగ్యం విషయానికి వస్తే చికిత్స పొందుతున్న ఆమె పూర్తిగా కోలుకున్నారని కరోనా నెగిటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జ్ కూడా చేశామని సదరు ఆసుపత్రి సిబ్బంది అధికారికంగా వెల్లడించారు.

సంబంధిత సమాచారం :

More