క్లైమాక్స్‌కు చేరుకున్న “రంగమార్తాండ”..!

Published on Jan 7, 2022 2:11 am IST


టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్ సాధించిన నటసమ్రాట్ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన దర్శకుడు కృష్ణవంశీ నా అభిమాన నటుడు, నట రాక్షసుడు ప్రకాశ్‌ రాజ్ తో ఎమోషనల్ కలిమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శివాత్మిక, బ్రహ్మానందం, అనసూయలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :