‘సర్కారు’లో మహేష్ పాత్ర చుట్టూ కామెడీ ట్రాక్ !

Published on May 24, 2021 9:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పరశురామ్ సూపర్ కామెడీ ట్రాక్ ను రాశాడని, ఈ ట్రాక్ బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మధ్య రానుందని, ఈ కామెడీ ట్రాక్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ ట్రాక్ మొత్తం సెకెండ్ హాఫ్ లో వస్తోందట. అన్నట్టు ఈ ట్రాక్ మహేష్ పాత్ర చుట్టూ తిరుగుతుందట. వీళ్ళ ముగ్గురి మధ్య ఫుల్ కన్ ఫ్యూజన్ డ్రామా చాల బాగుంటుందట. అంటే మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయట. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడు. ఇక మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :