మణిరత్నం వండర్ “పొన్నియన్ సెల్వన్” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 20, 2021 7:25 pm IST

ఇండియన్ సినిమా దగ్గర మంచి ఎవర్ గ్రీన్ పేరున్న అతి తక్కువ మంది వెర్సిటైల్ ఫిల్మ్ మేకర్స్ లో మణిరత్నం కూడా ఒకరు. మరి తన స్ట్రాంగ్ కం బ్యాక్ కోసమే ఒక్క సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే కాకుండా పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. దీనితో ఇప్పుడు తాను చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ వండర్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘చియాన్’ విక్రమ్ సహా కార్తీ ఎందరో స్టార్ నటులు కనిపిస్తున్న ఈ చిత్రం మళ్ళీ షూట్ ని పునః ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ పాండే లో తెరకెక్కిస్తున్నారట. మరి దీని తర్వాత హైదరాబాద్ లో మరి భారీ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

భారీ హిస్టారికల్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం అగ్ర తారాగణంతో రెండు భాగాలుగా షూట్ జరుపుకోనుంది. అలాగే ప్రస్తుతానికి అయితే 70 శాతం మేర షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మొదటి భాగం విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :