“నిఖిల్” భారీ సినిమా “స్పై” టీజర్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 5, 2022 2:00 pm IST

టాలీవుడ్ లో తన సినిమాలకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. తన నుంచి సినిమా వస్తుంది అంటే మినిమమ్ థ్రిల్ గ్యారెంటీ.. అలా ఇప్పుడు తాను పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తుండగా వాటిలో రీసెంట్ గా పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసిన భారీ చిత్రం “స్పై”. దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాలిడ్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా తాలూకా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఈ టీజర్ ని రేపు జూన్ 6 సోమవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఒక ఇంట్రో గ్లింప్స్ లా రిలీజ్ చేస్తునట్టు అనౌన్స్ చేశారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :