‘పడి పడి లేచె మనసు’ పడేసేలానే ఉంది !

‘పడి పడి లేచె మనసు’ పడేసేలానే ఉంది !

Published on Dec 14, 2018 11:29 PM IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చారు.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘నా పేరు సూర్య… పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్సయి సంవత్సరం అవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బ్రతికి ఉన్నానంటే కారణం వైశాలి’ అంటూ సాగిన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

అలాగే శర్వానంద్, సాయి పల్లవి మధ్య వచ్చే కొన్ని సీన్లు మనసు పిండేసేలా ఎమోషనల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేమలోని ఒక సరికొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించబోనుంది. మొత్తానికి ఈ ‘పడి పడి లేచె మనసు’ ఆడియన్స్ ఈ సినిమా మైకంలో పడేసేలానే ఉంది.

ఇక ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీదే రాని ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉందని… ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెబుతుంది చిత్రబృందం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు