“పుష్ప” ఫైనల్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 29, 2021 9:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం కూడా ఫైనల్ స్టేజ్ షూటింగ్ ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తారాగణమే కనిపిస్తుండగా ఈ లాస్ట్ స్టేజ్ స్టేజ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. సుకుమార్ ఇటీవలే తన ఆరోగ్య సమస్య నుంచి కోలుకొని మళ్ళీ షూట్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చెయ్యగా దానిని ఈ నెలాఖరుకి కంప్లీట్ చేసేయనున్నారట.

అలాగే ఆ తర్వాత మన దేశంలోనే పలు కీలక పాత్రల్లో సినిమాకి చెందిన ఆసక్తికర సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టుగా నయా టాక్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :