“రాధే శ్యామ్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 19, 2021 5:00 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ చిత్రం ఎట్టకేలకు షూట్ కంప్లీట్ చేసుకొని ఒక రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో ఆసక్తికర ఇన్ఫో ఒకటి వినిపిస్తుంది. అయితే ఆల్రెడీ మెయిన్ లీడ్ అంతా సినిమా కంప్లీట్ చేసేసుకోగా మళ్ళీ షూట్ ఏమిటా అనుకుంటున్నారా..

షూట్ అయితే ఉంది కానీ ఇందులో నటీ నటులు ఉండరట. కొన్ని లొకేషన్స్ ని సినిమా లోని కొన్ని సన్నివేశాల కోసం మాత్రమే షూట్ చేయనున్నారని తెలుస్తుంది. అందుకు మేకర్స్ ఒక మూడు రోజులు అలా షూటింగ్ ను ప్లాన్ చేసినట్టు టాక్. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సహా మరో ఇద్దరు హిందీ సంగీత దర్శకుడు వర్క్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :