రజిని లేకపోయినా షూట్ చేస్తాడట !

రజిని లేకపోయినా షూట్ చేస్తాడట !

Published on Jun 29, 2020 11:43 PM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ స్టార్ట్ కానుందట, కాకపోతే రజినీ ఇప్పట్లో షూట్ లో పాల్గొనడట. కరోనా ప్రభావం తగ్గేవరకూ శివ మిగిలిన సీన్స్ ను షూట్ చేసుకుంటాడట. ఇకపోతే ఎక్కువగా యాక్షన్ మూవీసే చేసే శివ.. మరి సూపర్ స్టార్ తో కూడా ఫుల్ యాక్షనే ప్లాన్ చేశాడా.. లేక కొత్తధనం కోసం కొత్తగా ఏమైనా ట్రై చేశాడా అనేది చూడాలి.

కాగా కథ అయితే సూపర్ స్టార్ కి అద్భుతంగా సెట్ అవుతుందని.. అందుకే రజినీకాంత్ కూడా సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారని తెలుస్తోంది. మొదటి నుండి దర్శకుడు శివ పట్ల ఆసక్తి చూపుతూ వచ్చిన రజనీ ఈ ప్రాజెక్ట్ పై నమ్మకంగా ఉన్నారు. దాంతో సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా వీరి కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివ మేటి దర్శకుడు. మాస్ లో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు