ఆ సిరీస్ ను కూడా చుట్టేస్తున్న ఆర్జీవీ !

Published on Aug 1, 2021 7:00 pm IST


రామ్ గోపాల్ వర్మ మొత్తానికి తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ తాజాగా తీస్తోన్న వెబ్ సిరీస్ ‘రకరకాల భార్యలు’. ఆడవాళ్ళ అసలు స్వరూపం బయట పెట్టడానికి ఆర్జీవీ ఈ వెబ్ సిరీస్ తీస్తున్నాడట. ఈ సిరీస్ షూటింగ్ ఈ రోజు నుండి మొదలు అయిందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో హీరోయిన్ ఉంటుందట.

అయితే, ఏ ఆలోచన వస్తే.. దాని పై సినిమాలు తీయడం ఆనవాయితీగా పెట్టుకున్న ఆర్జీవీ, ఈ సిరీస్ ను కూడా అలాగే చేస్తున్నాడట. కనీసం స్క్రిప్ట్ కూడా లేకుండా నోటికొచ్చింది చెబుతూ తన అసిస్టెంట్ చేత డైరెక్షన్ చేయిస్తూ మొత్తానికి ఈ సిరీస్ ను స్పీడ్ గా చుట్టేస్తున్నాడు. ఏది ఏమైనా ఆర్జీవీ కంపెనీ నుండి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌ లు అన్నీ క్రైమ్ చుట్టూ రొటీన్ ప్లే తో సాగుతూ బోర్ కొట్టిస్తున్నాయి. ఆడవాళ్ళ పై తీసే ఈ సిరీస్ వ్యవహారం కూడా అలాగే ఉండేలా ఉంది.

సంబంధిత సమాచారం :