ఇంట్రస్టింగ్ అప్ డేట్ తో ‘హిరణ్య కశ్యప’ !

Published on Jan 23, 2020 11:11 am IST

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ‘రానా’ ప్రధాన పాత్రగా ‘హిరణ్య కశ్యప’ అనే భారీ పౌరాణికం మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా సమ్మర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. రానా ప్రస్తుతం చేస్తోన్న విరాట పర్వం మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఆ తరువాత నుండి ‘హిరణ్య కశ్యప’ చిత్రం పైనే రానా తన దృష్టిని పెట్టనున్నాడు.

ఇక ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ప్రసుతం పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ ను పూర్తిగా రెడీ చేసుకుంటుంది చిత్రబృందం.

మొత్తానికి హిరణ్య కశ్యప చిత్రం తమ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దగ్గుబాటి రానా చేయనున్న ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందనుంది.

సంబంధిత సమాచారం :