సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘2.ఓ’ చిత్రం నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి సన్నధంగా ఉంది.
కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రజినీ సరసన కథానాయకిగా నటించిన ఐశ్వర్యారాయ్ అతిథి పాత్రలో కొద్దిసేపు కనిపించనుందని తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ వార్తలో ఎంత నిజం తెలియాలంటే.. 29వ తేదీ వరకు ఆగాలసిందే.
మొత్తానికి విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ లు సినిమా పై భారీగా అంచనాలను పెంచాయి. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ లు కథానాయకిగా నటించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


