“RRR” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

“RRR” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Published on Jul 21, 2021 8:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఇపుడు లాస్ట్ స్టేజ్ షూట్ లోకి రాగా జక్కన్న ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అత్యంత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తాను ఎట్టకేలకు మళ్ళీ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చినట్టు తెలిపింది. టీం “RRR” తనొచ్చేస్తున్నా అని అధికారిక అప్డేట్ ఇచ్చి తన బ్యాలన్స్ షూట్ ను స్టార్ట్ చేసేసింది.

ఇక అలాగే ఈ నెలతో ఈ చిత్రం మొత్తం షూట్ కూడా కంప్లీట్ అయ్యిపోవచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా ఆల్బమ్ కూడా పూర్తి కావచ్చింది. మరి అదెప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు