“సర్కారు వారి పాట” షూట్ పై మరో అప్డేట్.!

Published on Apr 14, 2021 3:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దీనిపైనా భారీ అంచనాలు సెట్టయ్యాయి. అయితే గత కొన్నాళ్ల కితమే దుబాయ్ లో ఓ కీలక షెడ్యూల్ ను ముగించిన మేకర్స్ లేటెస్ట్ గా హైదరాబాద్ లో నిన్నే కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు. మరి దీనిపై మరో ఇన్ఫో వినిపిస్తుంది.

ఈ షెడ్యూల్ లో ఒక్క మహేష్ మాత్రమే కాకుండా కీర్తి సురేష్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. దుబాయ్ షెడ్యూల్ లో కూడా కీర్తి నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు వీరిపై కొన్ని కీలక ఎంటర్టైనింగ్ సన్నివేశాలను దర్శకుడు పరశురామ్ పెట్ల ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి మహేష్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :