“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 26, 2021 10:02 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొనగా ఇటీవల జరిపిన ప్రెస్ మీట్ లో మహేష్ ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర అంశాలు దీనిపై వెల్లడించారు.

ఇక ఇప్పుడు ఈ చిత్రం షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ షూట్ ని మహేష్ కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తుంది. అలాగే మరో కీలక ప్రాజెక్ట్ నిమిత్తం ఇపుడు చిత్ర యూనిట్ అంతా కూడా స్పెయిన్ దేశానికీ పయనమవ్వనున్నారట.

దాదాపు మూడు వారాల పాటు ఈ షూట్ ఉంటుందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షూట్ కనుక ఫినిష్ అయితే దాదాపు 70 నుంచి 80 శాతం మేర ఈ సినిమా కంప్లీట్ అయ్యిపోనుందట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :