ఎస్ పి బాలు గారి ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఇదే.!

Published on Sep 15, 2020 12:00 pm IST

గత నెల ఆగష్టు మొదటి వారం నుంచి మన దేశీయ లెజెండరీ గాయకులు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు కరోనాతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోరాడుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత మాత్రం పరిస్థితి విషమించడంతో ఆయన అభిమానులు వైద్యుల కృషి మూలాన ఎట్టకేలకు స్వల్పంగా కోలుకోవడం మొదలు పెట్టారు.

ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ను ఆయన తనయుడు ఎస్ పి చరణ్ అందించేవారు. అలా లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్ ప్రకారం బాలు గారు ప్రస్తుతం బాగానే ఉన్నారని ఒక 15 నుంచి 20 నిముషాలు పాటు కుర్చీలో కూర్చోగలుగుతున్నారని అంతే కాకుండా ఆహరం కూడా తీసుకోగలుగుతున్నారని ఫిజియో థెరపీ కు కూడా బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు. ప్రస్తుతానికి అయితే అంతా బాగానే ఉందని ఒక పాజిటివ్ వార్తను ఆయన అభిమానులకు అందించారు.

సంబంధిత సమాచారం :

More