ఈ వారం సినిమాల పరిస్థితి ఏమిటి ?

Published on Aug 16, 2021 10:00 am IST

కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో జూన్‌ చివరి వారం నుండి థియేటర్లు తెరుచుకున్నాయి. మొదటి వారం ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వారం ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’తో పాటు ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే ఉత్సాహంతో గత వారం కూడా పాగల్ తో పాటు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.

ముందుగా ‘కనబడుట లేదు’ సునీల్‌ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ వారం మంచి అంచనాలు ఉన్న మరో సినిమా ‘రాజ రాజ చోర’. నవ్వులు పంచే చోరుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘క్రేజీ అంకుల్స్‌’ అంటూ మరో సినిమా కూడా ఈ వారమే రానుంది. సంపూ ‘బజార్‌ రౌడీ’ ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :