ఈ వారం సినిమాల పరిస్థితి ఏమిటి ?

Published on Aug 3, 2021 12:30 am IST

కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరుచుకున్నాయి. గత వారం ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ వారం కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏమిటి చూద్దాం. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’. సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ వారం రిలీజ్ రెడీగా ఉంది.

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొన‌గాళ్లు’ సినిమాతో పాటు ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే మరో సినిమా మరియు ‘మెరిసే మెరిసే’. అనే మరో చిన్న సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవుతున్నాయి. ఆలాగే ‘క్షీరసాగర మథనం’ అనే మరో చిన్న సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవ్వనుంది. పై సినిమాల్లో ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ పైనే కాస్త ఆసక్తి ఉంది. మిగితా ఏ సినిమాల పై ఎలాంటి అంచనాలు లేవు.

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-9 (ఆగస్టు 5)

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్‌ ప్రియులను అలరించే చిత్రాల్లో ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ ఒకటి. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకూ ఎనిమిది చిత్రాలు విడుదలై సందడి చేయగా, 9వ చిత్రం ‘ఎఫ్‌9’ త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 5న ఇంగ్లీష్‌, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించారు.

ది సూసైడ్‌ స్క్వాడ్‌(ఆగస్టు 5)

యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడే వారి కోసం మరో హాలీవుడ్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జేమ్స్‌ గన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘ది సూసైడ్‌ స్క్వాడ్‌’. మార్గట్‌ రోబీ, ఇడ్రిస్‌ ఎల్బా, జాన్‌ సెనా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 5న అమెరికాతో పాటు భారత్‌లోనూ విడుదల కానుంది.

☞ ఐ మే డెస్ట్రాయ్‌ యు(సీజన్‌-1) హెచ్‌బీవో

☞ మాన్‌స్టర్స్‌ ఎట్‌ వర్క్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

☞ షార్ట్‌సర్క్యూట్‌ సీజన్‌-1 (డిస్నీ+ హాట్‌స్టార్‌)

☞ టర్నర్‌ అండ్‌ హూచ్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

ఆగస్టు 6, 2021

☞ స్టార్‌ వార్స్‌: గార్డెన్‌ రామ్‌సే: అన్‌ ఛార్టెడ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)

☞ స్టార్‌ వార్స్‌: ది బ్యాడ్‌ బ్యాచ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)

☞ ది మిస్టీరియస్‌ బెనిడిక్ట్‌ సొసైటీ((డిస్నీ+ హాట్‌స్టార్‌)

☞ బ్రేకింగ్‌ బాబీ బోన్స్‌(సీజన్‌-1) (నేషన్‌ జియోగ్రాఫిక్‌)

సంబంధిత సమాచారం :