వెంకీ ‘ఎఫ్ 3’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jul 12, 2020 12:37 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా లేకపోయి ఉంటే, ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది ఈ సినిమా. కానీ, కరోనా దెబ్బకు ఈ సినిమా మరో ఏడాదికి పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసినా.. షూట్ చేయాలంటే భారీ క్రూ కావాల్సి రావడంతో ఇక కరోనా తగ్గేవరకూ ఇప్పట్లో షూట్ ప్లాన్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.

ప్రస్తుతం వెంక్కీ ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకనే వరుణ్, వెంకీలు ఎఫ్ 3 మీదకు వస్తారు. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి తన తరువాత సినిమాని బాలయ్యతో చేయబోతున్నాడని, ఇప్పటికే బాలకృష్ణ రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More