వెంకీ మామ “దృశ్యం 2” షూట్ అప్డేట్.!

Published on Apr 15, 2021 12:00 pm IST

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రస్తుతం రెండు రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో “నారప్ప” ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు సన్నద్ధంగా ఉన్న విషయం కూడా తెలిసిందే. దీనితో పాటుగా మరో హిట్ చిత్రం “దృశ్యం 2” రీమేక్ లో వెంకీ మామ జెట్ స్పీడ్ తో నటిస్తున్నారు.

ఆల్రెడీ మళయాళంలో హిట్ కాబడిన ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో వెంకటేష్ తన పార్ట్ వరకు షూట్ మొత్తం కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తుంది. మరి ఇది మాత్రం మామూలు స్పీడ్ కాదని చెప్పాలి. మరి మేకర్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :