విజయ్, పరశురామ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

విజయ్, పరశురామ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 8, 2023 2:05 PM IST

VD13

ప్రస్తుతం మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన హిట్ దర్శకుడు పరశురామ్ పెట్ల తో రీసెంట్ గా అనౌన్స్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ గా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ యూఎస్ లో లొకేషన్ రెక్కీ అయితే కంప్లీట్ చేసేశామని ఇక నెస్ట్ ఆ లొకేషన్స్ లో సినిమాని షూటింగ్ చేయడమే బ్యాలన్స్ ఉందని ఈ షూట్ ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సో అతి త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ చేసుకోనుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు విజయ్ అయితే “ఖుషి” సినిమాలో బిజీగా ఉండగా మృణాల్ అయితే రీసెంట్ గానే “లస్ట్ స్టోరీస్ 2” తో వెబ్ ఆడియెన్స్ ని పలకరించింది.

తాజా వార్తలు