విజయ్ దేవరకొండ “ఖుషీ” పై లేటెస్ట్ అప్డేట్!

Published on Feb 24, 2023 3:00 pm IST


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, సిజ్లింగ్ బ్యూటీ సమంత కొత్త చిత్రం ఖుషీ కోసం చేతులు కలిపారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనుంది. మరో గాసిప్ ఏమిటంటే, రెండు రొమాంటిక్ పాటల చిత్రీకరణ కోసం టీమ్ నార్వే వెళ్లనుంది.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేదేకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్, ఇతర వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

సంబంధిత సమాచారం :