హై వోల్టేజ్ యాక్షన్ కి పవన్ రెడీ !

Published on Jul 17, 2021 11:26 pm IST

పవన్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్స్ లో ఈ నెల 28 నుండి షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్స్ లో పవన్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించనున్నారు.

కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా తీసుకున్నారు. అలాగే పవన్ ను చూసి ఓ గిరిజిన యువతి ప్రేమలో పడుతుందని.. ఆ పాత్రలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :