‘బంగార్రాజు’తో లావణ్య త్రిపాఠి.. నిజమేనా ?

Published on Apr 1, 2020 9:00 pm IST

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’లో ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కలయికలో ఆ సినిమానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ఓ పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. లావణ్య, ‘సోగ్గాడే చిన్నినాయన’లో హీరోయిన్ గా నటించింది. మరి ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తోందా లేకా అతిథి పాత్రలో నటిస్తోందా అనేది చూడాలి.,

ఇక జులై మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, క్రిష్టమస్ కి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. మరి నాగ్ ఈ సారి కూడా హిట్ కొడతారేమో చూడలి. అయితే గత సినిమా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన `మ‌న్మ‌థుడు 2’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరించింది. దాంతో నాగార్జున తన తరువాత సినిమాల విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More