స్వయంవరం లయ ఎన్టీఆర్ మూవీని తిరస్కరించిందట.

స్వయంవరం లయ ఎన్టీఆర్ మూవీని తిరస్కరించిందట.

Published on Dec 1, 2019 2:06 AM IST

laya

తెలుగమ్మాయి లయ టాలీవుడ్ లో కొన్నాళ్లు మంచి మంచి చిత్రాలలో నటించారు. 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె స్కిన్ షోకి దూరంగా నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలు చేశారు. 2006లో లయ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఈమె సినిమాలు చేయడం తగ్గించారు. ఐతే గత ఏడాది శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. కాగా 2018లో వచ్చిన ఎన్టీఆర్ చిత్రంలో ఒక పాత్ర చేయాల్సివుండగా లయ తిరస్కరించారట.

త్రివిక్రమ్ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో క్రూరుడైన ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి భార్య పాత్రకు లయను సంప్రదించారట.ఐతే కొన్ని కారణాల చేత ఆమె ఆ పాత్రను తిరస్కరించారట. దీనితో ఈ పాత్రను ఈశ్వరి రావు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లయ బయటపెట్టారు. ఐతే ఆమెకు ఎన్టీఆర్ తో నటించాలన్న ఆసక్తి ఉందని, ఎప్పటికైనా నటిస్తాను అన్నారు.

తాజా వార్తలు