ఓటిటిలో అదరగొడుతున్న “లెజెండ్”.!

ఓటిటిలో అదరగొడుతున్న “లెజెండ్”.!

Published on Mar 4, 2023 2:00 PM IST

గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ దృష్టి ని ఆకర్షించిన సాలిడ్ పాన్ ఇండియా సినిమా “లెజెండ్”. ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ హీరోగా పరిచయం అవుతూ భారీ బడ్జెట్ తో అత్యున్నత నిర్మాణ విలువలతో చేసిన ఈ సినిమా ఆడియెన్స్ లో ఫలితంతో సంబంధం లేకుండా బాగానే క్లిక్ అయ్యింది. మరి ఈ సినిమా అప్పటి నుంచి రీసెంట్ గానే ఓటిటి లో రిలీజ్ అయ్యింది.

మరి డిస్నీ + హాట్ స్టార్ లో వచ్చిన ఈ సినిమా ఒక్కరోజులోనే అదరగొట్టే రెస్పాన్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఈ ఒక్కరోజులోనే ఇండియా వైడ్ అయితే నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీనితో ఈ సినిమాకి మాసివ్ రెస్పాన్స్ ఇక్కడ వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే జేడీ, జెర్రీ దర్శకత్వం వహించగా హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఆలాగే శరవణన్ నే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు