త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “లియో”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “లియో”

Published on Dec 30, 2023 12:27 AM IST


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓటిటి లో కూడా సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి రానుంది. ఈ చిత్రం కి త్రిష హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవి చందర్ ఈ సినిమా కి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు