లిఫ్ట్‌లో సత్యదేవ్ దుమ్ము దులిపేశాడుగా..!

Published on Jul 29, 2021 12:00 am IST

సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “తిమ్మరుసు”. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 30వ తేదిన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపధ్యంలో తాజాగా సినిమాలోని ‘లిఫ్ట్‌ ఫైట్‌’ను విడుదల చేసింది చిత్ర బృందం.

అయితే లిఫ్ట్‌ ఫైట్‌లో సత్యదేవ్ దుమ్ము దులిపేశాడు. ‘ఆసుపత్రికి వచ్చాను అమ్మతో ఇక్కడ మమ్మల్ని ఎవరో తరుముతున్నారు సర్‌.. మీకు లొకేషన్‌ షేర్‌ చేస్తున్నానని సత్యదేవ్‌కి ఫోన్‌లో చెప్పి తల్లీ కొడుకులు ఇద్దరు లిఫ్ట్‌లోకి ఎక్కారు. వాళ్లతో పాటు విలన్ గ్యాంగ్ కూడా అందులోకి వెళతారు. ఆ తల్లీ కొడుకులను చంపాలని చూసే సమయంలో లిఫ్ట్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి రౌడీలను చితకొట్టేశాడు. మధ్యలో నర్సు లిఫ్ట్‌లోకి వచ్చినప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి ఆమె దిగిపోగానే మళ్లీ ఇరగకుమ్మాడు. ఇందులో సత్యదేవ్ లుక్‌, యాక్షన్‌ అదిరిపోయిందనే చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :