ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన ‘లైగర్’ బ్యూటీ !

Published on Sep 25, 2022 10:30 pm IST

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇటీవల యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో దక్షిణాదిలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఐతే ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్న అనన్య కి చివరకు నిరాశే మిగిలింది. లైగర్ చిత్రం భారీ అంచనాలను అందుకోలేకపోయింది.

కాగా తాజాగా అనన్య పాండే ఓటీటీ లో అరంగేట్రం చేయనుంది. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్, ధర్మా ప్రొడక్షన్స్ యొక్క డిజిటల్ వింగ్ నిర్మించనున్న సిరీస్ ద్వారా అనన్య పాండే త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. అనన్య నటించబోయే ఈ సిరీస్ కు ‘కాల్ మీ బే’ అని టైటిల్ పెట్టారు, ఇందులో అనన్య రీచ్ గర్ల్ గా కనిపించనుంది.

ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సిరీస్ కు కొల్లిన్ డికున్హా దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భారీ తారాగణం కూడా ఉండనుంది. ఇక అనన్య పాండే తదుపరి చిత్రం విషయానికి వస్తే.. ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :