అవైటెడ్ “లైగర్” టీజర్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ టీం.!

Published on May 9, 2021 11:00 am IST

ఈరోజు మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులు మరియు ఇతర సినీ తారలు తనకి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “లైగర్” చిత్రం టీజర్ వస్తుంది అని అంతా ఆశించారు కానీ ఆ టీజర్ విడుదలపై క్లారిటీ ఇచ్చాడు.

పూరి జగన్నాథ్ తో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి అలా ఈరోజు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్లాన్ చేసిన టీజర్ ను విడుదల చెయ్యడం లేదని తెలియజేసాడు. ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితుల్లో టీజర్ విడుదల చేయడం సరికాదని అందుకే ఆ పవర్ ప్యాకెడ్ టీజర్ ను వాయిదా వేస్తున్నామని తెలిపారు.

దానిని ఈ పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ఖచ్చితంగా ఆ టీజర్ లో విజయ్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించడం ఖాయం అని మేకర్స్ కూడా తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కుదిరితే వాక్సిన్ వేయించుకొని ఆరోగ్యంగా ఉండలని విజయ్ మరియు నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ వారు ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం :