మైక్ టైసన్ తో లైగర్ టీమ్…ఫోటోలు వైరల్!

Published on Nov 17, 2021 3:53 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను పూరి జగన్నాథ్ మరియు ఛార్మి లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్ పై టైసన్ ఎలా ఉండనున్నారు అనే దాని పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు యూ ఎస్ లో జరుగుతుంది. చిత్ర యూనిట్ మైక్ టైసన్ తో బెస్ట్ టైం గడుపుతుంది అని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :