సమీక్ష : “లిల్లీ” – కంటెంట్ బాగున్నా కథనం కాబోదు

సమీక్ష : “లిల్లీ” – కంటెంట్ బాగున్నా కథనం కాబోదు

Published on Jul 8, 2023 7:34 AM IST
Lily Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 07, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: బేబీ నేహా, మాస్టర్ వేదాంత్ వర్మ, బేబీ ప్రణీత రెడ్డి, రాజ్‌వీర్, మిచెల్ షా, మాస్టర్ అయాన్, శివ కృష్ణ

దర్శకుడు : శివమ్

నిర్మాతలు: కె బాబు రెడ్డి, జి సతీష్ కుమార్

సంగీతం: ఆంటో ఫ్రాన్సిస్

సినిమాటోగ్రఫీ: రాజ్‌కుమార్

ఎడిటర్ : లోకేష్ కుమార్ కడలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అయితే ఓ చిన్న చిత్రం “లిల్లీ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే..లిల్లీ(బేబీ నేహా), దివ్య(బేబీ ప్రణీత) అలాగే వేదాంత్( వేదాంత్) ముగ్గురు కూడా స్కూల్ ఫ్రెండ్స్ కాగా దివ్యని ఓ రోజువారీ కూలీ అయినటువంటి దేవా(రాజ్ వీర్) పెంచుకుంటాడు. అయితే ఓరోజు సడెన్ గా దివ్య స్పృహ తప్పి పడిపోతుంది. దీనితో దేవా, ఆ ఇద్దరు పిల్లలు దివ్య ని హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఆమెకి లుకేమియా ఉందని చెప్తారు. దీనితో ట్రీట్మెంట్ కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. మరి తన కూతురుని తమ తోటి ఫ్రెండ్ ని కాపాడుకోడానికి ఆ తండ్రి, స్నేహితులు ఏం చేస్తారు ఆమెని కాపాడుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో చిన్న పిల్లలు అందరికీ ఇది మొదటి సినిమానే అయినప్పటికీ వారు కనబరిచిన నటనా పరిపక్వత అద్భుతం అని చెప్పాలి. తాము పలికించిన హావభావాలు పలు కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ చాలా నీట్ గా చేసేసారు. ఇంకా ముగ్గురు మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే హత్తుకుంటాయి.

ఇక దివ్య తండ్రి పాత్రలో నటించిన రాజ్ వీర్ కూడా మంచి నటన కనబరిచాడు. వీటితో పాటుగా చిత్రంలో కొన్ని సంక్లిష్ట పరిస్థితిలో ఉండే సీక్వెన్స్ లు చాలా రియలిస్టిక్ గా దర్శకుడు చూపించిన విధానం బాగుంది. వీటితో పాటుగా కొన్ని ఆసక్తికర ఎలిమెంట్స్ కూడా ఈ చిన్న సినిమాలో సర్ప్రైజింగ్ గా ఉంటాయి. అలాగే ఓ కీలక నటుడు పై డిజైన్ చేసిన సీక్వెన్స్ కూడా సినిమాలో బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మెయిన్ థీమ్ పాయింట్ ఎమోషనల్ గా తీసుకున్నప్పటికీ సినిమా టేకింగ్ అయితే చాలా నిరుత్సాహపరుస్తుంది. చాలా నెమ్మదిగా సాగే కథనం అది ఫస్టాఫ్ సెకండాఫ్ లో కూడా అలా బోర్ ఫీల్ కలిగింది. ఇంకా చాలా సన్నివేశాలు మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇంకా చాలా సన్నివేశాలు పిల్లల స్నేహం వారి మధ్య బాండింగ్ కోసమే చూపించడం బాగా ఎక్కువయ్యినట్టు అనిపిస్తుంది.

అలాగే సెకండాఫ్ లో ఎమోషన్స్ కూడా బాగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి. ఇంకా మాస్టర్ వేదాంత్ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. అలాగే తన పాత్రకి ఇతర చిన్నారుల పాత్రలకి మధ్య బాండింగ్ కూడా అంత బాగా రాసుకున్నట్టుగా అనిపించదు. ఇంకా కొన్ని పాత్రలు రొటీన్ గానే ఉన్నాయి. అలాగే చాలా సీన్స్ లో అయితే అసలు లిప్ సింక్ మిస్ అవుతుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇంకా టెక్నీకల్ టీం లో అయితే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వర్క్స్ బాగున్నాయి. అయితే ఆసక్తికరంగా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో గ్రాఫిక్స్ మేకర్స్ చాలా బాగా చూపించారు. ఇంకా ఎడిటింగ్ బాగా చేయాల్సింది.

ఇక దర్శకుడు శివమ్ విషయానికి వస్తే..తాను ఓ మంచి ఎమోషనల్ లైన్ ని పట్టుకున్నాడు కానీ దానిని ఆద్యంతం ఆసక్తిగా మలచడంలో మాత్రం విఫలం అయ్యారు. కొన్ని సీన్స్ వరకు అలాగే వి ఎఫ్ ఎక్స్ వర్క్ రాబట్టడంలో తనని మెచ్చుకొని తీరాలి. కానీ ఓవరాల్ వర్క్ లో మాత్రం తాను కాంప్రమైజ్ అయ్యాడు. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాని అనుకున్న టోన్ లో ప్రెజెంట్ చేసి ఉంటే బెటర్ ఫీల్ ఇచ్చేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “లిల్లీ” చిత్రంలో ముగ్గురు చిన్నారులు మంచి నటనను కనబరిచారు అలాగే కొన్ని ఎమోషన్స్ బాగుంటాయి. కానీ ఓ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాకి ఇవి చాలా తక్కువ. బోర్ గా సాగే కథనం డల్ స్క్రీన్ ప్లే ఈ ఎమోషనల్ డ్రామాని అయితే ఎంగేజింగ్ గా మార్చలేకపోయాయి. దీనితో ఈ చిత్రం అంతగా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు