ప్రీ పోన్ అయిన రజినీకాంత్ ‘లింగ’ ఆడియో రిలీజ్

ప్రీ పోన్ అయిన రజినీకాంత్ ‘లింగ’ ఆడియో రిలీజ్

Published on Oct 27, 2014 1:50 PM IST

Linga
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లింగ’. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఆ పాటని ప్రస్తుతం దుబాయ్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ పై పలుసార్లు పలు తేదీలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. ఈ సినిమా ఆడియో రిలీజ్ పై పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా నవంవర్ 4 అనుకున్నప్పటికీ ఫైనల్ గా నవంవర్ 9న ఆడియో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాల తర్వాత రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.

తాజా వార్తలు