అధికమొత్తానికి అమ్ముడవ్వనున్న ‘లింగా’ డబ్బింగ్ హక్కులు

అధికమొత్తానికి అమ్ముడవ్వనున్న ‘లింగా’ డబ్బింగ్ హక్కులు

Published on Jun 1, 2014 4:15 AM IST

rajini-kanth
రజని చిత్రం ప్రారంభం అయిన దగ్గర్నుండి అది నిర్మాతలకు మంచి వ్యాపారం తెచ్చిపెడుతుంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో రజని తాజా చిత్రం ‘లింగా’ నిర్మాతలు వున్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘లింగా’ నిర్మాతలను తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం దాదాపు 35 కోట్ల విలువైన ఆఫర్లు వస్తున్నాయి. ఒక డబ్బింగ్ చిత్రానికి ఇంత భారీ మొత్తం చాలా అసాధారణమైన విషయం.

ఇంకా ఈ డీల్ ఖరారు కానప్పటికీ తెలుగులో ఈ డబ్బింగ్ హక్కులని ఎవరో సంపాదిస్తారు అనేది చాలా ఆశక్తికరమైన విషయం. ప్రస్తుతం ‘లింగా’ చిత్ర యూనిట్ హైదరాబాద్లో ఒక భారీ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటుంది.

సోనాక్షి సిన్హా అనుష్క హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు