
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ చ్నేమ అదిరిపోయే ఓపెనింగ్స్ ని సంపాదించి ప్రస్తుతం బి,సి సెంటర్ లలో మంచి కలెక్షన్లను అందుకుంటుంది. విమర్శకులు ఈ సినిమాకి మధ్యస్థ రేటింగ్స్ ఇచ్చినా మంచి కలెక్షన్లు సాధించడం ఆశ్చర్యకరం. బాలకృష్ణ పవర్ ఫుల్ నటన, అదిరిపోయే డైలాగ్ లు థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాం కలెక్షన్ లు 3.60కోట్లను సాధించాయి. మొదటివారం కలెక్షన్ లు 15కోట్లు తాకాయి. దర్శకుడి ప్రతిభాలోపం కనిపించినా బాలయ్య ఒంటిచేత్తో ఈ చిత్రాన్ని లాక్కొచ్చిన తీరు అద్భుతమనే చెప్పాలి.

