
‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘లయన్’. ఈ సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావుతెలుగు వారు ఎక్కడ ఉన్నా వారందరికీ ఈ సినిమాని రీచ్ చెయ్యాలనే ఉద్దేశంతో భారీగా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. అందులో భాగంగానే పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువ థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కేవలం పక్క రాష్ట్రాల్లోనే కాకుండా ఒవరసీస్ లో కూడా భారీ ఎత్తున లయన్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
మే 14న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీమియర్స్ షోస్ మే 13న యుఎస్, కెనడాలో పడనున్నాయి. మొట్ట మొదటిసారిగా ఓవర్సీస్ లో బాలకృష్ణ ‘లయన్’ సినిమా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. లయన్ సినిమా ఓవర్సీస్ మొత్తంలో సుమారు 100 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు సంబదించిన డ్రైవ్స్ రీచ్ అయిపోయాయి. మై 11 నుంచి ఓవర్సీస్ లో బుకింగ్ కూడా స్టార్ అయ్యాయి. రిలీజ్ పరంగా భారీ ఓపెనింగ్ తెచ్చుకున్న లయన్ కలెక్షన్స్ పరంగా కూడా ఓవర్సీస్ లో రికార్డ్స్ సృష్టిస్తుందేమో చూడాలి. సత్య దేవా దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు.

