బాలయ్య ‘లయన్’ డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్.!

బాలయ్య ‘లయన్’ డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్.!

Published on May 19, 2015 8:40 PM IST

lion-record
సమ్మర్ కానుకగా నందమూరి బాలకృష్ణ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘లయన్’. మే 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను మెప్పించగా, మిగతా వారి నుంచి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ సమ్మర్ సీజన్ కావడం మరియు బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ వల్ల థియేటర్స్ ఎక్కువగా ఫుల్ అవుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ అన్ని ఎరియాల్లోనూ మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా తీసుకున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ని లయన్ సినిమా సేఫ్ జానే లో పడేసింది. ఎందుకు అంటే ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా రైట్స్ ని రీజనబుల్ రేట్స్ కి అమ్మడంతో మొదటి వీకెండ్ అనగా నాలుగు రోజులకే చాలా ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. మిగిలిన కొంతమంది కూడా మొదటి వారం చివరికల్లా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. సత్యదేవా దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాని రుద్రపాటి రమణారావు నిర్మించాడు.

తాజా వార్తలు